ఒక బౌల్ లోకి కప్ రైస్ ని తీసుకుని బాగా కడగాలి . కడిగిన తర్వాత దానికి సరిపడా వాటర్ ఆడ్ చేసుకుని రైస్ ని ప్రిపేర్ చేయాలి.ప్రిపేర్ అయిన రైస్ ని ప్లేట్ లోకి తీసుకోవాలి .  ముందుగా కొత్తిమీర , గ్రీన్ చిల్లీ తీసుకుని పేస్ట్ లా చేసుకోవాలి . తర్వాత కడాయి తీసుకుని ఆయిల్ ,తాలింపుగింజలు ,కరివేపాకు ,జీడిపప్పు ,చనిక్కాయపప్పులు ,వేసి బాగా ఫ్రై చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని కడాయి లో వేసి బాగా కలపాలి . ఫ్రై లాగా వచ్చిన తర్వాత ముందుగా తీసుకుని చల్లార్చిన రైస్ ని ఆడ్ చేయాలి . తర్వాత కొద్దిసేపు అలాగే వేడి చేసి ఉంచాలి . అలా  ఉంచితే ముందుగా ఫ్రై చేసిన మొత్తం flavours  రైస్ కి పడుతుంది . తర్వాత బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి . పైన కొత్తిమీర తో  గార్నిస్ చేసుకోవాలి .